Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటకలో ఘటన
బెంగళూరు: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా కనీస వైద్యం అందక ప్రజలు పిట్టల్లా రాలిపోతు న్నారు. ఇప్పటికే ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక పదుల సంఖ్యలో కరోనా రోగులు ప్రాణాలు కోల్పో యిన సంగతి తెలిసిందే. తాజాగా కర్నాటకలోని చామరాజనగర్లోని జిల్లా ఆస్పత్రిలో కేవలం 2 గంటల్లో వ్యవధిలో 24మంది రోగులు మర ణించారు. వీరందరూ కూడా ఆక్సి జన్ అందకే చనిపోయినట్టు సమా చారం. చనిపోయిన వారి కుటుంబ సభ్యులు సైతం ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతోనే మరణించారని కన్నీరుమున్నీరవుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి 2 గంటల మధ్య వీరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆస్పత్రిలో మొత్తం 144 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. మృతుల బంధువులు ఆస్పత్రి యాజమాన్య నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ నినదించారు. కాగా, ఈ విషాదకర ఘటనపై సీఎం యడియూరప్ప విచారణకు ఆదేశించారు.
చనిపోయారా? చంపేశారా?: రాహుల్ గాంధీ
చామరాజనగర్ ఘటనపై స్పందించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. 24 మంది రోగులు చనిపోయారా? లేక చంపేశారా? అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యవస్థ మేల్కొనక ముందు ఇంకా ఎన్ని మరణాలు సంభవించాలి? అఠటూ ట్వీట్ చేశారు. అలాగే, మృతుల కుటుంబాకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.