Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్ మాజీ గవర్నర్ జగ్మోహన్ మల్హోత్రా మంగళవారం కన్నుమూశారు. 93 ఏళ్ల ఆయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సివిల్ సర్వీసెస్ అధికారిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన ఆ తరువాత రాజకీయాల్లో చేరారు. జమ్ముకాశ్మీర్‌కు రెండుసార్లు (1984-89, 1990ల్లో) గవర్నర్‌గా పనిచేశారు. ఢిల్లీ, గోవాలకు లెఫ్టినెంట్ గవర్నర్‌గానూ బాధ్యతలు నిర్వహించారు. జగ్మోహన్ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా సంతాపం వ్యక్తం చేశారు