Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ నేత కపిల్ సిబల్
న్యూఢిల్లీ : కరోనా ఉగ్రరూపం దాల్చడంతో దేశం అరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయంపై అంతర్మథనం తరువాత ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ పేర్కొన్నారు. జి-23గా పేరుపొందిన కాంగ్రెస్ అసమ్మతి నేతల్లో సిబల్ కూడా ఉన్నారు. ఆయన ది హిందూ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ప్రదర్శన ఆందోళన కలిగించేది అయినా, కరోనాతో పోరే ప్రస్తుతం ప్రధానమైనదని అన్నారు. కరోనా కట్టడిలో ప్రభుత్వం వైఫ్యలం చెందిన నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడాన్ని ఆయన సమర్థించారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు సంబంధించిన విషయంలో ప్రతి దశ వివరాలను ప్రభుత్వం నుంచి కోరుతూ కోర్టు జ్యుడిషియల్ రిట్ అయిన మాండమస్ను నిరంతరం జారీ చేయాలని అభిప్రాయపడ్డారు. దేశం ఆరోగ్యపరమైన విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుంగా, ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ర్యాలీల్లో బిజీగా ఉండగా, ఎన్నికల సంఘం అయితే వైరస్ వ్యాప్తి పట్ల ఆందోళన చెందినట్లే కనిపించలేదని అన్నారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను ఏ ప్రాతిపదికన ఎనిమిది దశల్లో నిర్వహించారో చెప్పాలని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాల్సిన అవసరం ఉందని సిబల్ అన్నారు.