Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధతి నేపథ్యంలో వైద్య అవసరాల దష్ట్యా 10 రోజుల వ్యవధిలో 190 టన్నుల బరువైన దాదాపు 8 వేల మేర మెడికల్ పరికరాలను విమానాల ద్వారా తరలించామని ఎయిరిండియా విమానయాన సంస్థ మంగళవారం తెలిపింది. జర్మనీ, అమెరికా, బ్రిటన్, సింగపూర్ వంటి దేశాల నుంచి ఈ తరలింపు చేపట్టామని పేర్కొంది. కరోనా రెండో దశ విజృంభణతో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్, ఔషధాలు, వైద్య పరికరాల కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. గత 10 రోజుల్లో కరోనా రోగుల చికిత్సకు కీలకమైన ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్స్, బిపాప్ మిషన్లు, వెంటిలేటర్లను వాయుమార్గం ద్వారా ఆయా దేశాల నుంచి తీసుకొచ్చామని ఎయిరిండియా తన ప్రకటనలో వెల్లడించింది. రానున్న రోజుల్లో కూడా దీన్ని కొనసాగిస్తామని తెలిపింది.