Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కలబుర్గి : కర్నాటకలోని చామరాజ్ నగర్లో ఆక్సిజన్ కొరతతో 24మంది కోవిడ్ రోగులు మరణించిన మరుసటి రోజే మరో దారుణం జరిగింది. కలబుర్గి జిల్లాలోని ఆఫ్జల్పూర్ తాలుకాలో వెంటిలేటర్‌పై వున్న నలుగురు కోవిడ్ రోగులు మంగళవారం ఉదయం చనిపోయారు. చనిపోయిన వారందరూ 70 ఏళ్ల పైబడిన వారేనని, ఆదివారం సాయంత్రం వారికి కోవిడ్ సంబంధిత సమస్యలు తలెత్తాయని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఆక్సిజన్ కొరత కారణంగానే వారు చనిపోయినట్లు చెప్పారు. ఇతర వ్యాధులు కూడా ఉన్న వారు తీవ్ర ఇబ్బందులతోనే చనిపోయారని జిల్లా అధికారులు చెబుతున్నారు. ఆక్సిజన్ నిల్వలు వున్న కలబుర్గి నుండి ఆస్పత్రులకు ఆక్సిజన్ తీసుకురావడంలో మూడు నుంచి నాలుగు గంటలు ఆలస్యం జరిగిందని వారు అంగీకరించారు.