Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆన్లైన్ క్లాసుల.. స్కూళ్లపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో గతేడాది నుంచి దేశంలోని స్కూళ్లు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. ఇదివరకటి కంటే ఆన్లైన్ తరగతుల కారణంగా దానికి అవసరమైన ఇంటర్నెట్ కనెక్షన్, మొబైల్ లేదా కంప్యూటర్ల వల్ల విద్యార్థుల తల్లిదండ్రులపై మరింత భారం పడింది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు విద్యార్థుల ఫీజులు సైతం మరింత భారంగా మారాయి. దీనికి తోడు ఫీజుల విషయంలో ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్లు వెనక్కి తగ్గలేదు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. కేవలం ఆన్లైన్ క్లాసులే అయితే కచ్చితంగా ఫీజులు తగ్గించాల్సిందేనని స్పష్టం చేసింది. ఆన్లైన్ క్లాస్‌ల కారణంగా స్కూలు నిర్వహణ ఖర్చులు తగ్గాయి కాబట్టి ఆ ప్రయోజనాన్ని తల్లిదండ్రులకు బదిలీ చేయాలని సూప్రీంకోర్టు పేర్కొంది. కరోనా నేపథ్యంలో వారు పడుతున్న ఇబ్బందులను పాఠశాలల యాజమాన్యాలు అర్థం చేసుకునీ, వారికి ఉపశమనం కలిగించాలని ఆదేశించింది.
విద్యార్థులకు అందించని సౌకర్యాలకు కూడా ఫీజులు వసూలు చేయడం దారుణమని న్యాయస్థానం పేర్కొంది. ఇక గతేడాది లాక్డౌన్ కారణంగా చాలా కాలం స్కూళ్లు తెరవలేదు. దీని కారణంగా ఇంధన, కరెంటు, నిర్వహణ ఖర్చు, నీటి ఛార్జీలు, స్టేషనరీ ఛార్జీలు వంటివి మిగిలిపోయాయి. వీటిని సైతం దృష్టిలో ఉంచుకోవాలని న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరిలతో కూడిన ధర్మసనం పేర్కొంది.