Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: గత ఐదు రోజులలో వివిధ దేశాల నుంచి 300 టన్నుల అత్యవసర కోవిడ్-19 వైద్య సహాయ సామాగ్రితో కూడిన 25 విమానాలు దేశ రాజధాని ఢిల్లీలో అడుగుపెట్టాయి. ఇందులో 5,500 ఆక్సిజన్ కన్సన్ట్రేటర్స్, 3,200 ఆక్సిజన్ సిలిండర్లు, 1,36,000 రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు ఉన్నాయని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు చెందిన ఓ ప్రతినిధి చెప్పారు. ప్రభుత్వం సైతం దీనికి సంబంధించిన పలు పోస్టులను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇవి అత్యవసరంలో ఉన్న ఉన్న ప్రాణాలను నిలపడంలో కీలకంగా ఉంటాయి. అయితే, దేశరాజధానికి చేరిన ఈ వైద్య సామాగ్రి ఎక్కడని ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. ఎందుకంటే దేశరాజధానితో పాటు కొన్ని కీలోమీటర్ల దూరంలో ఉన్న వారికి నేడు ఆక్సిజన్ అందడం లేదు. దీంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఢిల్లీ హైకోర్టు సైతం ఏదేమైనప్పటికీ రాధానిలో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు సైతం జారీ చేసింది.
వివిధ దేశాల నుంచి భారత్కు చేరిన కోవిడ్-19 వైద్య ఆరోగ్య సామగ్రిపై స్పందించిన ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ నూటన్ ముండేజా.. 'నాకు ఇప్పటివరకు అందిన సమాచారం వరకు ఆ సామగ్రిలో తమకు ఏమీ అందలేదు' అని అన్నారు. దాదాపు లక్షకు పైగా యాక్టివ్ కేసులున్న ఢిల్లీలోని ఆస్పత్రుల్లో 20 వేలకు పైగా రోగులు ఆక్సిజన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల పలు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక ప్రాణాలు సైతం కోల్పోయారు. ఏప్రిల్ 30 నాటికే యూకే నుంచి 500, ఐర్లాండ్ నుంచి 700, ఉజ్జెకిస్తాన్ నుంచి 150 ఆక్సిజన్ కన్సన్ట్రేటర్స్, అమెరికా నుంచి వేయి ఆక్సిజన్ సిలిండర్లు ఢిల్లీకి చేరాయి. అయినప్పటికీ, ఆస్పత్రులు, రోగుల కుటుంబాలు సోషల్ మీడియాలో ఆక్సిజన్ కోసం తీరని విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నాయి. అయితే అత్యవసర సామాగ్రి స్థితి ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. కేవలం ఫ్రాన్స్ అందించిన ఆక్సిజన్ సామగ్రిని రాజధానిలోని ఆరు ఆస్పత్రులకు అందించారు. ఒక్క ఢిల్లీలోనే కాదు కరోనా పరిస్థితులు దారుణంగా ఉన్న ఇతర రాష్ట్రాలకు సైతం అత్యవసర వైద్య సామాగ్రిని పంపించినట్టు లేదు. ఇదే విషయమై కోవిడ్ సంబంధిత వైద్య సహాయ సమాగ్రి దేశీయ గమ్యస్థానాలకు పంపినట్టు రికార్డులు లేవని ఢిల్లీ విమానాశ్రయ ఓ అధికారి సోమవారం తెలపారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కరోనా కట్టడికి ఏం చర్యలు తీసుటోంది? 300 టన్నుల కోవిడ్-19 సహాయక సామగ్రి ఎక్కడీ అంటూ నెటిజన్లు, నిపుణులు సహా సర్వత్రా ప్రశ్నలు, విమర్శలు వస్తున్నాయి.