Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో మరో డెంజరస్ కరోనా వేరియంట్
- బోసిపోయిన కొత్తగా 3.57 లక్షల కరోనా కేసులు, 3449 మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే వెలుగుచూసిన పలు వేరియంట్లతో పాటు డబుల్ మ్యూటెంట్‌తో కేసులు భారీగా పెరుగుతున్న భారత్‌లో.. మరో డెంజరస్ వేరియంట్ వెలుగుచూసింది. ఈ కరోనా కొత్త వేరియంట్ ఒకే సారి ముగ్గురికి వ్యాపిస్తోందనీ, ఇది అత్యంత ప్రమాదకరమైనదని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఈ మేరకు టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్), ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) సంయుక్తంగా చేపట్టిన అధ్యయనానికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం వ్యాపిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఎంతో ప్రమాదకరమనీ, ఇది ఒకరి నుంచి ఒకేసారి ముగ్గురికి వ్యాప్తి చెందుతోందనీ, ఆ ముగ్గురి నుంచి అది మరింతమందికి వ్యాపిస్తోందని అధ్యయనం పేర్కొంది. కరోనా తొలి దశ కంటే రెండో దశ వైరస్ 2 నుంచి 2.5 రెట్లు అధిక శక్తిమంతమైనదని తెలిపింది. ఈ కొత్త వేరియంట్ కారణంగానే పాజిటివ్ కేసులతో పాటు మరణాలు సైతం భారీగా పెరుగుతున్నాయని ఈ అధ్యయన బృంద సభ్యులు సందీప్ జునేజా వెల్లడించారు.
దేశంలో కొత్తగా 3,449 కరోనా మరణాలు
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుంటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,57,229 పాజిటివ్ కేసులు, 3,449 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్-19 మరణాలు 2,22,408కి పెరిగాయి. పాజిటివ్ కేసులు 2,02,82,833 చేరాయి. ఇప్పటివరకు 1,66,13,292 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 34,47,133 యాక్టివ్ కేసులు ఉన్నాయి. సోమవారం నాటికి 15,89,32,921 మందికి టీకాలు వేశారు. అలాగే, 29,33,10,779 కరోనా పరీక్షలు నిర్వహించారు.
బీహార్‌లో సంపూర్ణ లాక్డౌన్
కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న బీహార్‌లో సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నామని రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ మంగళవారం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయి లాక్డౌన్ మే 15వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. రాష్ట్ర క్యాబినెట్, అధికారులతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు, కరోనా సంక్షోభ నిర్వహణకు సంబంధించిన ఆదేశాలు తాజాగా ట్వీట్ చేశారు. కాగా, బీహార్‌లో కొత్తగా 11,407 కరోనా కేసులు, 82 మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 5.09లక్షలకు, మరణాలు 2,800 దాటాయి.
కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా జర్నలిస్టులు: స్టాలిన్
డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తమిళనాడులో జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా ప్రకటించారు. అన్ని దినపత్రికలు, అన్ని మీడియా రంగాల్లో పని చేసే వారిని కరోనా యోధులుగా పరిగణించనున్నట్టు మంగళవారం తెలిపారు. మహమ్మారి సమయంలో జర్నలిస్టులు తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. కాగా, ఈ నెల 7న స్టాలిన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్‌ల సీఎంలు సైతం జర్నలిస్టులను కరోనా యోధులుగా ప్రకటించారు.