Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత్లో నాయకత్వలేమి, ముందు చూపు కొరత, తొందరగా సంతృప్తి పడే లక్షణాలకు పెరిగిపోతున్న కోవిడ్ కేసులే ఉదాహరణగా నిలిచాయని ఆర్బీఐ మాజీ గవర్నర్, ఆర్థిక వేత్త రఘురామ్ రాజన్ అన్నారు. ప్రముఖ ఆంగ్ల పత్రికతో ఆయన మాట్లాడారు. 'మనం అప్రమత్తంగా, ముందుజాగ్రత్తగా ఉండి ఉంటే.. ఈ పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చేదికాదు. గతంలో మనం వైరస్ను జయించామని భావించాం. వైరస్ తట్టుకొనే శక్తి వచ్చిందని భ్రమించి మళ్లీ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని తెరిచాం. ఆ రకంగా భ్రమించడమే ఇప్పుడు ముప్పుగా మారింది' అని వ్యాఖ్యానించారు. మొదటివేవ్లో విజయం సాధించామని భావించాం. టీకాలను అందుబాటులోకి తెచ్చే అంశంపై కూడా తగిన దృష్టి పెట్టలేదు, ఆలస్యమైంది' అని రఘురామ్ రాజన్ తెలిపారు.