Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. కొత్త కేసులు, మరణాలు భారీగా నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,82,315 మందికి కరోనా సోకింది. ఇదే సమయంలో 3,780 మంది వైరస్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాలు 2,26,188 చేరగా, పాజిటివ్ కేసులు 2,06,65,148కి పెరిగాయి. ఇప్పటివరకు 1,69,51,731 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 34,87,229 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, దేశవ్యాప్తంగా ఇప్పటిరకు మొత్తం 29,48,52,078 కరోనా పరీక్షలు నిర్వహించారు. 16,04,94,188 మందికి వ్యాక్సిన్లు వేశారు.
13 రాష్ట్రాల్లో నిత్యం 100కు పైగా మరణాలు
దేశంలో అత్యధికంగా కరోనా ప్రభావం ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, బెంగాల్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, గుజరాత్, హర్యానాలు టాప్‌లో ఉన్నాయి.