Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8న సీఐటీయూ, ఏఐకేఎస్, ఏఐఎడబ్ల్యూయూ ఆన్లైన్ భారీ బహిరంగసభ
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ బాధ్యతారాహిత్యంతోనే దేశంలో దారుణ పరిస్థితి ఏర్పడిందని ఆలిండియా అగ్రికల్చరల్ వర్కర్స్ యూనియూన్ (ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి వెంకట్ పేర్కొన్నారు. 'కరోనా సవాళ్లు - కేంద్ర ప్రభుత్వ విధానాలు - ప్రజా సంఘాల పాత్ర'పై ఈ నెల 8న సీఐటీయూ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ ఆధ్వర్యాన బహిరంగసభ నిర్వహిస్తున్నామని బుధవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కరోనాతో తీవ్ర అస్వస్థతకు గురైన వారికి ఆక్సిజన్ కూడా సకాలంలో సరఫరా చేయలేని ప్రభుత్వ అసమర్థత వల్ల ప్రజలు బలవుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ దుస్థితిలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం సీఐటీయూ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ తరపున సహాయక చర్యలు చేపట్టడానికి అఖిల భారత స్థాయిలో ఆన్లైన్ బహిరంగసభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో తనతోపాటు సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్, ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా ప్రసంగిస్తారని పేర్కొన్నారు. మూడు సంఘాల జాతీయ అధ్యక్షులు డాక్టర్ హేమలత, అశోక్ ధావలే, విజయ రాఘవన్ అధ్యక్షతన సభ జరుగుతుందని వివరించారు. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వంపై ఏ విధంగా పోరాడాలన్న అంశాలపై వక్తలు ప్రసంగిస్తారని వెంకట్ తెలిపారు. వివిధ వర్గాల ప్రజలు లక్షలాదిగా పాల్గొని సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు.