Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిలిపివేతపై పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు స్వీకరణ
న్యూఢిల్లీ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో కొత్త పార్లమెంటు భవన నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. విచారణ తేదీని నిర్ణయిస్తామని తెలిపింది. కోవిడ్ మహమ్మారి సమయంలో.. దేశంలో ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో వేలాది మంది ప్రజలు చనిపోతున్నారు. ఇలాంటి సమయంలో భవన నిర్మాణ పనులను 'అవసరమైన సేవల' పరిధిలోకి తెచ్చిమరీ ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు, సామాజిక కార్యకర్తల నుంచి తీవ్రవిమర్శలు ఎదురయ్యాయి. కాగా, ఈ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై తక్షణ విచారణ జరపాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణను పిటిషనర్ల తరఫున న్యాయవాది సిద్ధార్థ్ లుథ్రా అభ్యర్థించారు.