Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: జీ-7 దేశాల విదేశాంగ మంత్రుల భౌతిక సమావేశం రెండు సంవత్సరాల తర్వాత జరిగింది. ఇందులో చైనాకు వ్యతిరేకంగా ఉమ్మడిగా ఎలా పని చేయాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ సమావేశం లండన్లో జరిగింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జీ-7 దేశాల మధ్య లోతైన అవగాహనతో సంఘీభావం పెరగాలనీ, ప్రజాస్వామ్యాన్ని రక్షించే దిశగా అది సాగాలని దిశానిర్ధేశ నేపథ్యంలో ఈ మూడు రోజుల సమావేశం ప్రారంభం అయింది. ఉత్తర కొరియా, ఇరాన్, అణు ఆయుధాల గురించి ప్రారంభంలో చర్చ జరిగింది. రెండో రోజు చైనాలో ఆర్థిక, సైనిక, శాస్త్ర రంగాలలో జరుగుతున్న అభివృద్ధి తమకు ఇబ్బందులు కలిగించవచ్చు. కావునా దాన్ని అరికట్టేందుకు ఉమ్మడిగా కృషి జరగాలనే అంశం చుట్టూ చర్చ కొనసాగింది. ట్రంప్ హాయంలో చైనా పట్ల వాడిన తీరును భాషకు కొంత బదులుగా ఆమెరికా విదేశాంగ మంత్రి మాట్లాడుతూ.. వాతావరణ మార్పులాంటి అంశాలపై చైనాతో కలిసి పనిచేసే మార్గాల గురించి ఆలోచించాలని చెప్పుకొచ్చారు.