Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఇప్పటికే దేశం కరోనా వైరస్ రెండో దశ ధాటికి విలవిలాడుతున్న తెలిసిందే. అయితే భారత్‌కు మూడో దశ ముప్పు తప్పదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అలాగే భవిష్యత్‌లో రోజుల్లో మరిన్ని దశలు కూడా వస్తాయని పేర్కొంది. వీటిని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించింది. బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
'ప్రస్తుతం వైరస్ సంక్రమణ స్థాయిలను బట్టి చూస్తే మూడో దశ (థర్డ్ వేవ్) అనివార్యం. అయితే, ఈ దశ ఎప్పుడు సంభవిస్తుందనే విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పలేం. మరిన్ని దశలను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలి. వైరస్‌లో ఏర్పడే మార్పులను ముందుగానే అంచనా వేసి.. వాటికి అనుగుణంగా వ్యాక్సిన్లను ఎప్పటికప్పడు అప్డేట్ చేసుకోవడం ఎంతో అవసరం' అని కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు డాక్టర్ విజరురాఘవన్ స్పష్టం చేశారు.