Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం: రాష్ట్రంలో నెలకొన్న రోజువారీ డిమాండ్ దష్ట్యా ఆక్సిజన్ నిల్వలు రోజురోజుకు తగ్గిపోతున్నాయని, ఈ నేపథ్యంలో తమకు మెడికల్ ఆక్సిజన్ సపఫరా చేయాలని కేరళ సిఎం పినరయి విజయన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోడీకి బుధవారం ఒక లేఖ రాశారు. కరోనా రెండో దశ వ్యాప్తితో కేరళ తీవ్రంగా పోరాడుతోందని, కేసుల పెరుగుదల భారీగా ఉందని తెలిపారు. ఇటువంటి సమయంలో రాష్ట్ర ప్రజల ప్రాణాలను కాపాడేందుకు లిక్కర్ ఆక్సిజన్ అవసరం పెరుగుతోందని, రోజవారీ డిమాండ్ కారణంగా ప్రస్తుతం దాని స్టాక్ వేగంగా పడిపోతుందని విజయన్ తన లేఖలో వివరించారు.విదేశాల నుంచి దిగుమతి చేసుకున్ననిల్వల నుంచి కేరళకు వెంటనే వెయ్యి టన్నుల లిక్కర్ మెడికల్ ఆక్సిజన్‌ను సరఫరా చేయాలని విజయన్ మోడీని కోరారు. అదేవిధంగా తక్షణం 500 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికిల్ ఆక్సిజన్‌ను అందించాలన్నారు. మిగతా దాన్ని దగ్గర్లోని స్టీల్‌ప్లాంట్ నుంచి సరఫరా చేయాలని కోరారు. ఇంకా ఆక్సిజన్‌తో పాటు 50 లక్షల కోవిషీల్డు వ్యాక్సిన్లు, 25 లోల కోవాగ్జిన్ వ్యాక్సిన్లు కేటాయించాలని విజయన్ కోరారు. రాష్ట్రంలో కరోనా ఉధతి పెరుగుతున్న నేపథ్యంలో విజయన్ ఈ లేఖ రాశారు. పెరుగుతున్న కేసులను దష్టిలో పెట్టుకొని ఆసుప్రతుల్లో బెడ్లు, వెంటిలేటర్ల సంఖ్యను పెంచుతున్నారు. వైరస్ మహమ్మారి ప్రభావం భయంకరంగా ఉందని, పరిస్థితులు మరింత దిగజారే పరిస్థితి ఉందని విజయన్ మంగళవారం ఒక సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు హౌటళ్లను కోవిడ్ సెంటర్లుగా మార్చింది. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు పలు ఆంక్షలు విధిస్తోంది.