Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కరోనా సంక్షోభంతో ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్న భారత్‌ను గట్టెక్కించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకున్నది. దేశంలో కొరవడుతున్న వైద్యరంగాన్ని ఊపిరిలూదేందుకు.. వైద్యరంగానికి నిధులను అందిస్తామని ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంతదాస్ బుధవారం తెలిపారు. రూ.50 వేలకోట్ల మేర ఆన్‌ట్యాప్ నిధులను అందుబాటులోకి తీసుకు వచ్చినట్టు వెల్లడించారు. ఈ నిధులకు మూడేండ్ల కాల వ్యవధి ఉంటుందని ఆయన చెప్పారు. ఈ నిధులను వ్యాక్సిన్ తయారీ చేసే సంస్థలకు, ఆస్పత్రుల్లో వైద్య సదుపా యాలు మెరుగు పర్చేందుకు రుణాలుగా ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో లాక్డౌన్ కారణంగా ప్రభావితమైన వ్యక్తులకు, చిన్న, సూక్ష్మ, మధ్య తరగతుల వ్యాపారులకు వన్‌టైమ్ రుణాలను తిరిగి ఆర్బీఐ ప్రారంభించనుంది. ప్రస్తుతం దేశం చీకట్లో ఉందని, ఈ క్షణాల్లో వెలుతురిపై దృష్టి సారించాలని అన్నారు. దేశమంతా ఏకమై... కరోనా తొలివేవ్ విసిరిన సవాలును అధిగమిం చామని అన్నారు. నిత్యం వెలుగుతున్న దీపంలా విశ్వాసాన్ని కలిగి ఉండాలనీ, తద్వారా వెలుగు నివ్వడమే కాకుండా... చుట్టు ప్రక్కలా ప్రకాశాన్నందిస్తుందని పేర్కొన్నారు. కరోనాపై పోరాడుతున్న వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తలు, పోలీస్ సిబ్బందికి శక్తికాంతదాస్ ధన్యవాదాలు తెలిపారు.