Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సిన్లపై దృష్టి పెట్టాలి
- కేంద్రానికి సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో విజ్ఞప్తి
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ ప్రజా జీవి తాన్ని తీవ్రంగా అతలాకుతలం చేస్తోంది. నివారించగలిగే ఈ మర ణాల పట్ల సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అశువులు బాసిన వారి కుటుంబాలకు సంతాపం తెలియచేసింది. ఎన్ని విజ్ఞ ప్తులు చేసినా, జీవితాలను కాపాడే ప్రాణ వాయువును సరఫరా చేసేలా చర్యలు తీసుకోవడంలో కేంద్రం విఫలమైందని విమర్శించింది. ఆన్ లైన్ సమావేశం జరిపిన సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో ఈమేరకు ఒక ప్రకటన జారీ చేసింది. అన్ని ఆస్పత్రులకు, ఆరోగ్య కేంద్రాలకు, ఇంట్లో వుండి చికిత్స తీసుకుంటూ అవసరమైన వారికి ఆక్సిజన్ నిరంతరాయంగా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని పొలిట్‌బ్యూరో పునరుద్ఘాటించింది. దేశవ్యాప్తంగా వెంటనే పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. దేశీయంగా, అంతర్జాతీయంగా అందుబాటులో వున్న అన్ని వనరుల నుండి వ్యాక్సిన్లను సమకూర్చుకోవాలి. ప్రభుత్వ రంగంలో వున్న అన్ని వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాలను వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం వినియోగించుకోవాలి. వ్యాక్సిన్ల కోసం బడ్జెట్లో కేటాయించిన రు.35వేల కోట్లను వెంటనే ఖర్చు పెట్టాలని కోరింది.
జీవనోపాధి సమస్యలు : దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా మహమ్మారి, లాక్డౌన్ల కారణంగా ఇబ్బందులు తలెత్తుతుండడంతో లక్షలాదిమంది ప్రజలు తమ ఉపాధులను కోల్పోయారు. ఈ సమయంలో ఉపాధి పరిరక్షణకు ఆదేశాలు జారీ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి వుంది. ఈ అధికారాలను ఉపయోగించి ప్రజల జీవనోపాధులను కాపాడేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది. ఆదాయపన్ను పరిధికి వెలుపల గల కుటుంబాలన్నింటికీ నెలకు రు.7500 చొప్పున నేరుగా నగదు బదిలీ చేయడం తప్పనిసరి. దీన్ని వెంటనే ప్రారంభించాలి.
ఆహార ధాన్యాలు : కేంద్ర గోదాముల్లో కోట్లాది టన్నుల ఆహార ధాన్యాలు ముక్కిపోతున్నాయి. వీటిని వెంటనే అవసరంలో వున్నవారికి పంపిణీ చేయాలి.
సెంట్రల్ విస్టా నిర్మాణాన్ని ఆపాలి..
మానవారోగ్యానికి సంబంధించి ఇంత సంక్షోభం నెలకొంటే వేలాదికోట్ల రూపాయిలు ఖర్చుతో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రం కొనసాగించడం ఏమాత్రమూ సముచితం కాదు. దీన్ని వెంటనే నిలిపివేయాలి. ఆ డబ్బును ఆక్సిజన్ సరఫరాకు, వ్యాక్సిన్లు, ఇ తర ఆరోగ్య సదుపాయాలు కల్పించడానికి బదిలీ చేయాలి.
అసెంబ్లీ ఎన్నికలు..
కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ. మతోన్మాద ధోరణులను రెచ్చగొట్టడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టినా, కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేసినా, ఎన్నికల యంత్రాంగంలో మార్పులు చేర్పులు చేసినా, ప్రజల మద్దతను పొందడంలో బిజెపి విఫలమైంది. నిర్ణయాత్మకమైన రీతిలో పరాజయాన్ని మూటగట్టుకుంది.
తాజా ఎన్నికల ఫలితాలు దేశంలో ప్రజా ఉద్యమాలను, పోరాటాలను మరింత బలోపేతం చేశాయి. దేశ లౌకిక ప్రజాస్వామ్య స్వభావాన్ని పరిరక్షించేందుకు, ప్రజల జీవన పరిస్థితులను మరింత మెరుగుపరిచేందుకు ఈ పోరాటాలు ఉద్దేశించబడ్డాయి.
కేరళ : కేరళలో వామపక్ష సంఘటన (ఎల్డీఎఫ్) ఘన విజయం సాధించడాన్ని పొలిట్‌బ్యూరో ప్రశంసించింది. ఎల్డీఎఫ్ పట్ల మరోసారి విశ్వాసం కనపరిచినందుకు కేరళ ప్రజలకు కృతజ్ఞతలు తెలియచేసింది. ప్రస్తుతమున్న ప్రభుత్వానికే ప్రజలు మరోసారి అధికారం కట్టబెట్టడం నాలుగు దశాబ్దాల తర్వాత కేరళలో చోటు చేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కన్నా ఈసారి ఎల్డీఎఫ్ మెరుగైన పనితీరు కనపరిచింది. ప్రస్తుత ప్రభుత్వ పనితీరుకు, అనుసరించిన ప్రత్యామ్నాయ విధానాలకు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొన్న తీరుకు, కరోనాను, దాని ప్రభాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్న రీతికి, సంక్షేమ చర్యలకు, కేరళ సమాజ లౌకిక, ప్రజాతంత్ర, సామరస్య స్వభావాన్ని పరిరక్షించినందుకు కేరళ ప్రజలు ఓటు వేశారు.
పశ్చిమ బెంగాల్ : పశ్చిమ బెంగాల్లో ధన బలాన్ని ఉపయోగించినా, పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడినా బీజేపీకి గట్టి ఎదురుదెబ్బే తగిలింది. మత ధోరణులను రెచ్చగొట్టే సిద్ధాంతాలను బెంగాల్ ప్రజలు నిర్ద్వంద్వంగా తిప్పికొట్టారు. సీపీఐ(ఎం), వామపక్షాల పనితీరు చాలా నిరాశజనకంగా వుంది. బీజేపీని ఎలాగైనా ఓడించాలనే ప్రజల ఆకాంక్ష బీజేపీ, టీఎంసీల మధ్య తీవ్రమైన పోటీకి దారి తీయడమే కాకుండా, సంయుక్త మోర్చాను నులిమివేసింది. ఈ ఫలితాలపై తీవ్ర స్థాయిలో ఆత్మ విమర్శ చేపట్టి, వీటి నుండి గుణపాఠాలు నేర్చుకునే రీతిలో సమీక్ష చేపడతామని పొలిట్‌బ్యూరో తెలిపింది.
తమిళనాడు : డీఎంకే నేతృత్వంలోని కూటమి తమిళనాడులో ఘన విజయాన్ని సాధించింది. అన్నాడీఎంకే-బీజేపీ కూటమిని రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టారు. ప్రస్తుత అన్నాడీఎంకే ప్రభుత్వానికి ఓటమిని అందించారు.
అసోం : బీజేపీ తన ప్రభుత్వాన్ని ఇక్కడ నిలబెట్టుకోగలిగింది. ఓట్ల వాటా చూసినట్లైతే, బీజేపీ కూటమికి, మహా కూటమికి వచ్చిన ఓట్ల తేడా చాలా స్వల్పంగా వుంది.
ఎన్నికల అనంతరం హింస
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే వామపక్షాల సభ్యులు, మద్దతుదారులపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు హింసాత్మక దాడులకు పాల్పడడాన్ని పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది.