Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆక్సిజన్ మరణాలపై కోర్టుల నిలదీత
- కరోనా సునామీలా చుట్టేస్తున్నది.. రెండో వేవ్ ముప్పు పొంచి ఉందన్న నిపుణుల
హెచ్చరికలను
- కోవిడ్-19 సెంటర్ల నిర్వహణపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని అలహాబాద్ కోర్టు ఆదేశం
- ఢిల్లీకి ఆక్సిజన్ ఇవ్వండి ొ కోర్టుల వైపు దౌడు తీస్తే పనికాదు : సుప్రీంకోర్టు
సైతం బేఖాతరు చేసింది కేంద్ర సర్కార్. ఇప్పుడు జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు.. ప్రాణవాయువు అందక ప్రాణాలు కోల్పోతున్నారు.. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం సహా.. దేశం నలుమూలలా ఉన్న న్యాయస్థానాలు మోడీ సర్కార్‌కు అక్షింతలు వేస్తూనే ఉన్నాయి. అయినా చలనం కనిపించటంలేదు. ఏడాదికిందట వచ్చిన కరోనా వైరస్‌ను నిర్లక్ష్యం చేయటంవల్లే ఇపుడు అమాయకప్రజల ప్రాణాలు పోతున్నా...మోడీ ప్రభుత్వం ఇప్పటికీ కదలటంలేదు. ఎన్నికలొస్తే యుద్ధాలకు సన్నద్ధమయ్యే కేంద్రం..కరోనాపై ఆ విధంగా ఎందుకని సమాయత్తం కావటంలేదని జనం అడుగుతున్న ప్రశ్న. దేశ ప్రజలు చనిపోతే పోనీ మనకెందుకన్నట్టుగా భావిస్తున్నదా..!
సెకండ్ వేవ్‌లో అత్యధిక కేసులు, మరణాలూ పెరుగుతున్నా.. విదేశాలనుంచి కరోనా కట్టడికి సహాయసహకారాలు ఢిల్లీకి చేరుతున్నా భీష్మించుకుని కూర్చున్నది. దీనిపై న్యాయస్థానాలు
మోడీ సర్కార్‌తోపాటు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు మొట్టికాయలు వేస్తున్నాయి.
లక్నో: ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆక్సిజన్ కొరత కారణంగా ఆస్పత్రులో రోగులు చనిపోవడం మారణ హోమమేనంటూ అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఉత్తప్రదేశ్‌లోని పలు జిల్లాల్లోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక అధిక సంఖ్యలో రోగులు నిత్యం ప్రాణాలు కోల్పో తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి, మరోవైపు రాష్ట్రంలోని కరోనా వ్యాప్తి, కోవిడ్-19 సెంటర్ల నిర్వ హణపై ఆందోళన వ్యక్తమవుతోంది. మరీ ముఖ్యంగా లక్నో, మీరట్ జిల్లాలోని పలు ఆస్పత్రులో పదుల సంఖ్యలో రోగులు ప్రాణాలు కోల్పోయారనీ, ఆక్సిజన్ కొతర, అధికారుల నిర్లక్ష్యమే కారణమనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని బుధవారం న్యాయస్థానం విచా రించింది. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ''ఆక్సిజన్ కొరతతో కరోనా రోగులు ప్రాణాలు కోల్పోవడం మమ్మల్ని తీవ్రంగా కలచివేస్తోంది. ఇది ఒక నేరపూరిత చర్య. ప్రస్తుత విపత్కర సమయంలో నిరంతరాయంగా ఆక్సిజన్‌ను సమకూర్చుకొనీ, అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత కలిగిన అధికా రుల వైఖరి మారణహౌమం కంటే తక్కువేమీ కాదు'' అంటూ జస్టిస్ సిద్ధార్థ వర్మ, జస్టిస్ అజిత్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. శాస్త్రవిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెంది గుండె ట్రాన్స్‌ప్లాంటేషన్, మెదడు శస్త్రచికిత్సలు సైతం జరుగుతున్న ఈ కాలంలో ప్రజలు ఈ విధంగా మరణించడం ఎంత వరకు సమంజసం అంటూ ప్రశ్నించింది. అలాగే, ''దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొందని తమకు నివేదికలు అందుతున్నాయనీ, ఈ కేసులో వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులు సైతం వాటిని ధ్రువీకరిస్తున్నారని తెలిపింది. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరముందనే దర్యాప్తునకు ఆదేశిస్తున్నామంటూ ధర్మాసనం పేర్కొంది. మీరట్, లక్నో సహా ఇతర ఘటనలపై వెంటనే విచారణ జరిపి 48 గంటల్లో తమకు నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్లకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
ప్రణాళికలతో నేడు హాజరుకావాలి :
కేంద్రానికి సుప్రీం ఆదేశం
దేశ రాజధానికి ఢిల్లీకి ఆక్సిజన్ సరఫరా విఫయంపై ప్రణాళికలతో గురువారం హాజరుకావా లని కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఢిల్లీకి ఆక్సిజన్ విఫలమైనందుకు ఆ రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన ధిక్కార నోటీసులపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. మీరు కేవలం ఒక కోర్టు నుంచి మరో కోర్టు వైపు దౌడు తీస్తున్నారు. దయచేసి ఆక్సిజన్ డిమాండ్, సరఫరా గురించి చెప్పండి. అసలింతకీ ఈ సమస్యను పరిష్కరించడానికి ఏ చర్యలు తీసుకు న్నారు? కరోనా వైరస్ దేశమంతా విజృంభిస్తుంటే... ఆక్సిజన్ సరఫరాను నిర్ణయించే మార్గాలను అన్వేషించాలి. ఢిల్లీ ప్రజలకు సమాధానం ఇవ్వలేకపో తున్నాం అని సుప్రీం కోర్టు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. కేంద్రంలోని అధికారులను జైలుకు పంపడం లేదా ధిక్కార కేసుల్లోకి లాగడం వల్ల ఆక్సిజన్ లభించదన్న కోర్టు ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. ఆక్సిజన్ లేకపోవడం వల్ల జనం ప్రాణాలు కోల్పోతున్నారనీ, ఇది జాతీయ అత్యవసర పరిస్థితి అనీ, దీనిపై ఎలాంటి సందేహం లేదని అభిప్రాయపడింది. ముంబయిని మోడల్‌గా తీసు కొని గుణపాఠంగా తీసుకోవాలనీ, పూర్తి స్థాయిలో ఆక్సిజన్‌ను ఢిల్లీకి సరఫరా చేయటానికి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. మీకు 20 గంటల సమయం ఇస్తున్నాం.. గురువారం ఉదయం 10.30 గంటలకు 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఢిల్లీకి ఇచ్చేలా ప్రణాళిక తయారుచేసు కుని రావాలని కేంద్రానికి స్పష్టం చేసింది.
ఆక్సిజన్ ప్లాంట్‌లో పేలుడు..
యూపీ లక్నోలో ప్రమాదం..
ముగ్గురు మృతి.. ఏడుగురికి తీవ్రగాయాలు..
యూపీలో ఆక్సిజన్ కొరత వెంటాడుతున్నది. యోగి సర్కార్ నిర్లక్ష్యం కారణంగా అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా లక్నోలోని ఓ ఆక్సిజన్ ప్లాంట్‌లో ప్రమాదం సంభ వించగా.. ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దేవారోడ్లో ఉన్న కాటి ఆక్సిజన్ ప్లాంట్‌లో బుధ వారం పేలుడు జరిగింది. పోలీసులు, రెస్క్యూ టీమ్ లు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.