Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలువురి సంతాపం
విజయనగరం : ఏపీ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.శేషగిరి (48) మరణించారు. పది రోజుల క్రితం కరోనా బారినపడిన ఆయన విజయన గరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అయినా ఆరోగ్య పరిస్థితి మెరుగు పడలేదు. దీంతో, గత నెల 30న విశాఖలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరారు. హఠాత్తుగా బుధవారం రాత్రి కన్ను మూశారు. ఆయన భౌతికకాయానికి నగరంలోని శ్మశాన వాటికలో గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. శేషగిరి మృతికి సీపీఐ(ఎం)ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి మధు సంతాపం తెలిపారు. ఉపాధ్యాయ, ప్రజాతంత్ర ఉద్యమం చురుకైన నాయకుడిని కోల్పోయిందని ఏపీయుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కెఎస్ఎస్ ప్రసాద్, సీఐటీయూ ఏపీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులు సిహెచ్.నర్సింగరావు, ఎంఎ గఫూర్ పేర్కొన్నారు. శేషగిరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.