Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రముఖ హేతువాది నరేంద్ర దబోల్కర్ హత్య కేసు నిందితుల్లో ఒకరైన విక్రమ్ భవేకు ముంబయి హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం మహారాష్ట్రలోని యరవాడ సెంట్రల్ జైలులో ఉన్న విక్రమ్‌కు లక్ష రూపాయల పూచీకత్తుపై బెయిల్‌ను మంజూరు చేసింది. తన బెయిల్‌ను ప్రత్యేక కోర్టు తిరస్కరించడంతో విక్రమ్... ముంబయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. విచారణ కోర్టు పరిధిని విడిచి వెళ్లకూడదని జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ మనీష్ పిటేల్తో కూడిన డివిజనల్ బెంచ్ పేర్కొంది. మొదటి వారంలో ప్రతి రోజూ పోలీస్‌స్టేషన్‌కు హాజరుకావాలని, అనంతరం రెండు నెలల పాటు వారానికి రెండు సార్లు పోలీస్ స్టేషన్‌ను హాజరుకావాలని ఆదేశించింది. విచారణ ముగిసే వరకు వారానికి ఒక సారి పోలీస్‌స్టేషన్‌కు రావాలని తెలిపింది. 2013లో పూణెలోని ఓంకారేశ్వర్ గుడికి సమీపంలో మార్నింగ్ వాక్ చేస్తున్న దబోల్కర్పై ఆగంతకులు కాల్పులు జరిపి పరారైన సంగతి విదితమే. దీనిపై విచారణ చేపట్టిన సిబిఐ, 2019లో షార్స్ షఉటర్ విక్రమ్ భవేతో పాటు సచిన్ అంధురే, శరద్ ఖలాస్కర్ను అరెస్టు చేసింది.