Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆక్సిజన్ కొరత కారణంగా ఢిల్లీలో అనేక మంది కరోనా బాధితులు పిట్టల్లా రాలిపోతున్నారు. దీనిపై సాయం చేయాల్సిన మోడీ సర్కార్ అసహనం వ్యక్తం చేసింది. తీవ్రత ఎక్కువున్న ఢిల్లీకి ఆక్సిజన్ తగినంత అందించకపోవడంపై కేంద్రంపై కేజ్రీవాల్ ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. ప్రతిరోజూ 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను కేంద్రం సరఫరా చేసినట్లయితే మా పాలనాయంత్రాంగం ఏ ఒక్కరూ మరణించకుండా చూస్తుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. '700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసినట్లయితే.. ఢిల్లీలో 9 వేల నుంచి 9,500 బెడ్స్‌ను ఏర్పాటు చేయగలం. ఆక్సిజన్ బెడ్లను కూడా ఏర్పాటు చేస్తాం. ఏ ఒక్కరూ ఆక్సిజన్ కొరత కారణంగా చనిపోరని హామీనిస్తున్నా' అంటూ పేర్కొన్నారు. తమకు అధికారికంగా కేటాయించిన ఆక్సిజన్‌లలో సగమే అందుకుంటున్నామని, మా పొరుగు రాష్ట్రాలు...బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, హర్యానాలకు అధిక ప్రాధాన్యతనిస్తుందని విమర్శించారు. ప్రాణవాయువు కొరతతో...ఆస్పత్రులు సైతం తమ బెడ్ కెపాసిటినీ తగ్గిస్తున్నాయని అన్నారు. తిరిగి మీ బెడ్ కెపాసిటీని పెంచాలనీ, ప్రతి రోజు 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందుకుంటామని కేజ్రీవాల్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు 730 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందుకోవడంతో సుప్రీంకోర్టు, హైకోర్టు, కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.