Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఎన్నికల కమిషన్‌పై సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. మీడియాపై ఫిర్యాదు చేయడం కంటే ఏదైనా మంచి పనిచేయండని సూచించింది. కరోనా విజృం భిస్తున్న సమయంలో ఎన్నికల ర్యాలీలకు అనుమతి నివ్వ డాన్ని ఎన్నికల కమిషన్ వైఫల్యంగా పేర్కొన్న మద్రాస్ హైకోర్టు ఈసీపై హత్య కేసు నమోదు చేయాలంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ అంశంపై మీడియా నివేదికలను నియంత్రించాలని సుప్రీంకోర్టులో ఈసీ పిటిషన్ దాఖలు చేసింది. ఆర్టికల్ 19 భావ ప్రకటనా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రం కేవలం ప్రజలకే వర్తించదనీ, మీడియాకు ఈ హక్కు ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. మీడియాను కట్టడి చేయాలని చూస్తే...సుప్రీంకోర్టుకు అది తిరోగమనమేనని పేర్కొంది. కోర్టు ప్రొసిడింగ్స్‌ను నివేదించకుండా... మీడియాను నియంత్రించాలని ఈసీ విజ్ఞప్తి చేయడం అర్థరహితమని పేర్కొంది. న్యాయ వ్యవస్థకు జవాబుదారీతనం చాలా అవసరమని జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలు కఠినమైన, ఘాటైనవే అయినప్పటికీ.. న్యాయ వ్యవస్థకు సంయమనం అవసరమని స్పష్టం చేసింది. రాజ్యాంగ నియమాలకు న్యాయ భాష చాలా ముఖ్యమనీ, న్యాయ సమీక్ష అధికారం చాలా ఎక్కువని.. ఇది ప్రాథమిక నిర్మాణాన్ని రూపొందిస్తుందని తెలిపింది. అదే సమయంలో ఎన్నికల సంఘం న్యాయమైన, స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహిస్తోందని పేర్కొంది. అయితే పెరుగుతున్న కోవిడ్ కేసులు దష్ట్యా ప్రజల భద్రతను, జీవితాలను పరిరక్షించే బాధ్యత స్థానిక కోర్టులకుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.