Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) అధినేత అజిత్ సింగ్ (82) కోవిడ్‌తో కన్నుమూశారు. ఏప్రిల్ 20న నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్టు నిర్ధారణ కాగా, గుర్గావ్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స తీసుకుంటూనే గురు వారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమా రుడు, మాజీ ఎంపీ జయంత్ చౌదరి వెల్లడించారు. ఆయన మృతికి ప్రధాని మోడీ, ఇతరులు సంతాపం తెలిపారు. ఐఐటీ ఖరగ్ పూర్, అమెరికాలోని ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అజిత్‌సింగ్ విద్యనభ్యసించారు. ఏడుసార్లు ఎంపీగా ఎన్నికైన అయిన వి.పి సింగ్, పి.వి నరసింహారావు, అటల్ బీహారీ వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల్లో కేంద్రమంత్రిగా కూడా వ్యవహరించారు. ఉత్తరప్రదేశ్‌లో రాజకీయంగా ఎదిగిన ఆయనకు... ముఖ్యంగా జాట్ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న ఉత్తర భాగంలో మంచి ఆదరణ ఉంది.
అజిత్‌సింగ్ మరణం తీరనిలోటు
మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి
అజిత్‌సింగ్ మరణం దేశానికి తీరనిలోటని మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ అన్నారు. కేంద్ర మంత్రి హౌదాలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆయన ఎంతో సహకరించారని గుర్తుచేశారు. ఈ మేరకు దిలీప్‌కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమించిన ఏకైక నాయకుడు అజిత్ సింగ్ అనీ, ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.