Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రమాదకర కరోనా ప్రభావం
- తీవ్రంగా నష్టపోయిన ఆర్థిక వ్యవస్థ
- అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ అధ్యయనం
న్యూఢిల్లీ : ప్రమాదకర కరోనా మహమ్మారి దేశంలోని ప్రజలను పేదరికంలోకి నెట్టెస్తున్నది. ఉద్యోగ, ఉపాధిని కోల్పోయేలా చేసి వారిని ఇప్పటికే ఆర్థికంగా వెనక్కి నెట్టేసింది. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో దాదాపు 23 కోట్ల మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువకు వచ్చారు. అజీం ప్రేమ్జీ విశ్వవిద్యా లయం (ఏపీయూ)లోని సెంటర్ ఫర్ సస్టైనబుల్ ఎంప్లారుమెంట్ తయారు చేసిన ఒక నివేదికలో ఈ విషయం వెల్లడైంది. '' స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2021-వన్ ఇయర్ ఆఫ్ కోవిడ్-19'' పేరిట ఈ నివేదకను విడుదలైంది. ఇందులో కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన దారుణ పరిస్థితులు, ప్రజలు, ఉద్యోగులు, కార్మికుల జీవితాల్లో వచ్చిన ప్రతికూల మార్పుల గురించి వివరించింది. కరోనా మహమ్మారికి ముందు స్థాయికి ఉపాధి, ఆదాయం ఎలా కోలుకోలేదో అన్న అంశాన్ని నివేదిక హైలెట్ చేసింది. గతేడాది మహమ్మారి కాలంలో స్త్రీలు.. పురుషుల కంటే ఎక్కువ సంఖ్యలో ఉపాధిని కోల్పోయారని పేర్కొన్నది. లాక్డౌన్ కాలంలో కార్మికులు, పేద కుటుంబాలు ఆదాయంలో చాలా ఎక్కువ నష్టాలను అనుభవించాయని వివరించింది. కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థకు అపారమైన నష్టాన్ని తీసుకొచ్చిందని నివేదికల్లో వెల్లడించారు. అదనంగా 23 కోట్ల మంది ప్రజలు.. జాతీయ కనీస వేతన దారిద్య్రరేఖకు దిగువకు వచ్చారని పేర్కొన్నది. కరోనా కల్లోల కాలంలో పేదలు ప్రయివేటు వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీ రేటుతో అప్పులు తీసుకొని కష్టాలు ఎదుర్కొన్నారని నివేదిక వివరించింది. అలాగే, ఆహార అభద్రత, పేదరికం, అసమానతల పెరుగుదలకు దారి తీసిందని వెల్లడించింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులను మరింత దిగజారుస్తుందని ఏపీయూకు చెందిన అమిత్ బాసోల్ హెచ్చరించారు. హర్యానా, ఢిల్లీ, యూపీ, మహారాష్ట్ర, తమిళనాడులలో ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని తెలిపారు. ఇక పురుషులతో పోల్చుకుంటే మహిళలు ఎక్కువగా ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉంటుందని నివేదిక హెచ్చరించింది. ఎంప్లారుమెంట్ నుంచి 7శాతం మంది పురుషులు కోలుకోలేదనీ, ఇది మహిళల విషయంలో 46.6 శాతంగా ఉన్నదని పేర్కొనడం గమనార్హం. మహమ్మారి సమయంలో మహిళలు ఎక్కువ గృహ అవసరాలకే పరిమితమైనందున చాలా మంది మహిళలు 'ఇంటికి పరిమితమయ్యార'ని నివేదికలో వెల్లడించారు. మహమ్మారి కాలంలో అధిక సంఖ్యలో ఉద్యోగులు తక్కువ మొత్తంలో వేతనాల చెల్లింపులకు నోచుకున్నారని తేలింది. ఇక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పథకం (ఉపాధి హామీ పథకం) అమలులో అపరిమితమైన డిమాండ్ ఉన్నదని పేర్కొన్నది. కార్యక్రమ బడ్జెట్ తిరిగి మహామ్మారి ముందు స్థాయికి చేరుకున్నదని నివేదిక వివరించింది.