Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కరోనా కష్టకాలంలోనూ వాహనదారులపై పెట్రో భారం తగ్గేలా కనబడటం లేదు. దేశంలోని సామాన్యుల జేబులకు చిల్లులు పడేలా మోడీ సర్కారు వ్యవహరిస్తున్నది. వరుసగా మూడో రోజూ ఇంధన ధరలు ఎగబాకాయి. లీటర్ పెట్రోల్‌పై 25 పైసలు, డీజీల్‌పై 30 పైసలు పెరిగి ధరలు ఆకాశాన్నంటాయి. ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు సవరించిన ధరల ప్రకారం.. దేశరాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.99కి, డీజీల్ ధర రూ. 81.42కు ఎగబాకింది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.34, డీజీల్ ధర రూ. 81.42కు చేరింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 92.90కు, డీజీల్ ధర రూ. 86,42కు ఎగబాకింది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.14కు, డీజీల్ ధర రూ. 84.26కు చేరింది. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 23 పైసలు పెరిగి రూ. 94.57కు చేరింది. డీజీల్‌పై 31 పైసలు పెరిగి ధర రూ. 88.77కు ఎగబాకింది. కాగా, ఈ మూడురోజుల్లోనే పెట్రోల్‌పై 59 పైసలు, డీజీల్‌పై 69 పైసలు పెరిగి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలు నిత్యవసరాలపై సైతం పడుతున్నాయి.