Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తున్నది. పలువురు నిపుణుల అంచనా వేసిన విధంగానే దేశంలో కోవిడ్ కేసులు నాలుగు లక్షలు దాటేశాయి. మరోవైపు మృత్యు ఘోష కూడా అదే స్థాయిలో వినిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,980 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు విడిచారు. అలాగే 4,12,262 మందికి వైరస్ సోకింది. ఇప్పటి వరకూ ఒక్కరోజులో ఏ దేశంలో నమోదు కానన్ని కేసులు మన దేశంలో వెలుగుచూస్తున్నాయి. రోజుకో రికార్డు నమోదవుతున్నది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో ఇప్పటి వరకు 2,10,77,410 మంది కరోనా బారినపడ్డారు. 2,30,168 మంది మృతిచెందారు. అలాగే గడిచిన 24 గంటల్లో 3,29,113 డిశ్చార్జి అయ్యారు. మొత్తంగా రికవరీ అయిన కేసుల సంఖ్య 1,77, 80, 844గా ఉంది. ప్రస్తుతం దేశంలో 35,66,398 క్రియాశీలక కేసులు ఉన్నాయి.