Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సిన్ డోసులను వ్యర్థం కాకుండా చూడటంలో కేరళ ప్రభుత్వ పనితీరును ప్రధాని ప్రశంసిం చారు. కరోనా మహమ్మారిపై ప్రస్తుతం కొనసాగుతున్న పోరు లో డోసుల వ్యర్థాన్ని నిలువరిం చడం ముఖ్యమని ఆయన అన్నారు. రాష్ట్రానికి అందిన వ్యాక్సిన్లకు సంబంధించి కేరళ సీఎం పినరయి విజయన్ మం గళవారం ట్వీట్ చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి 73,38,806 డోసులు అందా యనీ, అందుబాటులో ఉన్న అదనపు డోసులను వినియోగించు కొని ప్రజలకు 74,26,164 డోసులు అందించామని పేర్కొన్నారు. ఇందు కు కృషి చేసిన రాష్ట్రంలోని ఆరోగ్య కార్యకర్తలు, ప్రత్యేకం గా నర్సులను సీఎం విజయన్ ప్రశంసించారు. విజయన్ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ ప్రధాని మోడీ బుధవారం ట్వీట్ చేశారు. వ్యాక్సిన్ డోసులు వ్యర్థ్యాన్ని తగ్గించడంలో మన ఆరోగ్య కార్యకర్తలు, నర్సులను ఉదాహరణగా చూడడం ఆనందంగా ఉంది. కరోనాపై పోరును బలోపేతం చేసేందుకు ఈ వ్యాక్సిన్ల వ్యర్థాన్ని తగ్గించడం చాలా ముఖ్యమైన అంశం అని పేర్కొన్నారు.