Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
అమరావతి : సంగం డెయిరీ యాజమాన్య నిర్వహణ బాధ్యతలను పాడి పరిశ్రమ అభివద్ధి సంస్థ పరిధిలోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 19వ నెంబర్ జిఓను హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సంగం పాల ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోయయాజులు ఈ మేరకు ఆదేశాలిచ్చారు. 'డెయిరీ నిర్వహణ బాధ్యత సంగం పాల ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్‌కే ఉంటాయి. కోర్టు అనుమతి లేకుండా ఆస్తుల తనఖా పెట్టకూడదు..' అని ఈ ఆదేశాల్లో పేర్కొ న్నారు. అదే సమయంలో డెయిరీ అక్రమాలపై ఎసిబి దర్యాప్తును నిలుపుదల చేయాలంటూ దాఖలైన పిటిషణ్‌ను తిరస్కరిం చింది. అభ్యంతరాలను ఎసిబి కోర్టుకు చెప్పుకోవాలని సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు.