Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం : కరోనాపై పోరులో భాగంగా దేశంలోని మిగతా రాష్ట్రాలకు కేరళ ఆదర్శంగా నిలుస్తున్నది. ఎప్పటికప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వైద్యపరంగానూ, ఆక్సిజన్ ఉత్పత్తి విషయంలోనూ, వ్యాక్సినేషన్ డ్రైవ్‌లోనూ కేరళ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నది. సెకండ్‌వేవ్‌లో తీవ్రంగా పెరిగిపోతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని ప్రజల్లో అవగాహన కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వ ఎడ్యుకేషన్ చానెల్ కైట్ విక్టర్స్ను విజయన్ సర్కారు ప్రారంభించింది. అవగాహనా కార్యక్రమాలు, లైవ్-ఫోన్-ఇన్ కార్యక్రమాలతో కరోనా విషయంలో ప్రజలకు సహాయాన్ని అందిస్తున్నది. కైట్ విక్టర్స్తో పాటు ఇతర చానెళ్ల ద్వారా ప్రజల్లో అనుమానాలు, ఆందోళనలు తొలగిపోతాయని ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ఇటీవల బహిరంగ సభల్లో తెలిపారు. ఇదే విషయంపై కొత్త కార్యక్రమాలను రూపొందించామని కేరళ ఇన్ఫ్రాస్ట్రక్షర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్ (కైట్) అథారిటీస్ వెల్లడించింది. కాగా, రాష్ట్ర ఆరోగ్య శాఖ భాగస్వామ్యంతో ఈ చానెల్ ద్వారా రెండు రకాల కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నారు. అందులో మొదటిది కరోనా నియంత్రణకు సంబంధించిన అవగాహన వీడియోలు కాగా, రెండోది ''అతిజీవనమ్'' పేరుతో నిర్వహించే లైవ్-ఫోన్-ఇన్ కార్యక్రమం. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలు కోవిడ్-19 విషయంలో అవగాహన పెంచుకొని అపోహలకు దూరంగా ఉండటానికి తోడ్పాటునందిస్తుందని అధికారులు తెలిపారు. అలాగే, ఫోన్ ఇన్ కార్యమ్రం ద్వారా కాలర్లు నిపుణులు, వైద్యులతో మాట్లాడి తమ ప్రాంతాల్లో కోవిడ్-19కు సంబంధించిన టెస్టింగ్, క్వారంటైన్, హౌం ఐసోలేషన్, చికిత్సకు సంబంధించిన మార్గదర్శకాలతో పాటు అనేక విష యాల గురించి మాట్లాడి అనుమానాలు నివృత్తి చేసుకుంటారని చెప్పారు. ఇందు కోసం ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నెంబర్‌ను కూడా కేటాయించారు. దీనితో పాటు ప్రత్యే కించి విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం మహిళా శిశు సంక్షేమాభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారంతో మానసిక శ్రేయస్సు కోసం మరొక ఫోన్-ఇన్-ప్రొగ్రామ్‌ను టెలికాస్ట్ చేస్తున్నారు. ఇది సోమ, బుధ, శుక్రవారాల్లో ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య టెలికాస్ట్ అవుతుందని అధికారులు చెప్పారు. అయితే, ఈ విధంగా చానెళ్ల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించి, వైద్యులు, నిపుణులతో అనుమానాలు నివృత్తి చేయించడం తమకు ఎంతగానో ఉపయోగపడుతున్నదని ప్రజలు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.