Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : డీఎంకె అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడు ఎంకె స్టాలిన్ ముఖ్యమంత్రిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ముఖ్యమంత్రి పదవిని అధిరోహిం చడం ఇదే తొలిసారి. రాజభవన్లో స్టాలిన్ చేత గవ ర్నర్ బనర్విలాల్ పురోహిత్ ప్రమాణం చేయించారు. కోవిడ్ నేపథ్యంలో అత్యంత నిరాడంబరంగా ఈ కార్యక్రమం సాగింది. ఆయనతో పాటు మరో 33 మంది క్యాబినేట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకా రం చేశారు. హౌం శాఖ బాధ్యతలను కూడా స్టాలిన్ స్వీకరించారు. పదవిని చేపట్టిన కొద్ది నిమిషాలలోనే స్టాలిన్ ఐదు ముఖ్యమైన ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇందులో కుటుంబాలకు ఆర్థిక సహాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పాల ధరల తగ్గింపు, కరోనా ఆర్ధిక సహాయం నాలుగు వేల రూపాయలు ఉన్నాయి. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఇవి కొన్ని.
పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా
రంగసామి ప్రమాణ స్వీకారం..
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్సీ) అధినేత ఎన్. రంగసామి ప్రమాణ స్వీకారం చేశారు. ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ రంగసామితో ప్రమాణస్వీకారం చేయించారు. పుదుచ్చేరి రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి కొద్దిమందిని మాత్రమే అనుమతించారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏప్రిల్ 6న జరిగిన ఎన్నికల్లో ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 స్థానాలను గెలుచుకుంది. ఎన్ఆర్ కాంగ్రెస్ మిత్రపక్షం బీజేపీ ఆరు చోట్ల విజయం సాధించింది. పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలుండగా.. ఎన్డీయే కూటమి 16 స్థానాలు సాధించింది. మరో ఆరుగురు స్వతంత్రులు సభకు ఎన్నికవగా.. వారంతా రంగసామి మద్దతుదారులే కావడం విశేషం. డీఎంకే 13 స్థానాల్లో పోటీ చేయగా ఆరు, కాంగ్రెస్ 14 స్థానాల్లో పోటీ చేయగా.. రెండింటిలో విజయం సాధించింది.