Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈసీ పనితీరు నా మనస్సాక్షి అంగీకరించేలా లేదు..
న్యూఢిల్లీ : భారత ఎన్నికల కమిషన్ (ఈసీ)కి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్యానల్ కౌన్సిల్ మోహిత్ డి. రామ్.. తన పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. కమిషన్ ప్రస్తుత పనితీరు తన మనస్సాక్షి అంగీకరించే విధంగా లేదని పేర్కొన్నారు. 2013 నుంచి ఈసీ తరుపున ప్యానల్ కౌన్సిల్‌గా మోహిత్ డి రామ్ వ్యవహరిస్తున్నారు. 'ఈసీఐకు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా ఉంది. స్టాండింగ్ కౌన్సిల్ ఆఫ్ ఈసీ కార్యాలయంలో తన కెరీర్ ప్రారంభం కావడం, అందులో భాగం కావడం, ఈసీ ప్యానెల్ కౌన్సిల్లో ఒకటిగా పురోగమించడం తనకొక మైలురాయి లాంటిదని లా కమిషన్ డైరెక్టర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఏదేమైనా తన విలువలు ఈసీ ప్రస్తుత పనితీరుకు అనుగుణంగా లేవని తాను గుర్తించాననీ, సుప్రీంకోర్టులో ప్యానెల్ న్యాయవాది పదవీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నానని లేఖలో రాశారు.