Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: కొత్తగా ఎన్నికైన తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె.పళనిస్వామి ఎన్నికయ్యారు. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమైన నూతన ఎమ్మెల్యేలు ఎఐఎడిఎంకె లెజిస్లేటర్ పార్టీ నేతగా పళని స్వామిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు సోమవారం పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. సమావేశం తరువాత ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి కెశ్రీనివాసన్కు లేఖను కూడ అందచేసినట్లు ప్రకటించింది. అసెంబ్లీలో రెండో అతి పెద్ద పార్టీగా ఏఐఎడీఎంకే ఆవిర్భంచిన సంగతి తెలిసిందే. కాగా, సోమవారం నుంచి తమిళనాడులో పూర్తిస్థాయిలో లాక్డౌన్ నిబంధనలు అమలవుతున్న నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేల సమావేశం గురించి పోలీసులకు మాజీ ఎంపీ, ఏఐఎడీఎంకే జిల్లా కార్యదర్శి ఎన్ బాలగంగ సమాచారం ఇచ్చారు. కోవిడ్-19 నిబంధనల మేరకే సమావేశం జరిగినట్లు పార్టీ నేతలు తెలిపారు.