Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలగించిన 17 మంది కార్మికులను తిరిగి చేర్చుకోండి: బీబీఎంపీకి ఆదేశాలు
బెంగళూరు : కర్నాటక రాజధాని బెంగళూరులో సంచలనం రేపిన బెడ్ స్కాం విషయంలో సస్పెండ్ అయిన 17 మంది కోవిడ్ వార్ రూమ్ వర్కర్లను తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలంటే బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ)కి ఆదేశాలు అందాయి. ఈ బెడ్ స్కాం ను బెంగళూరు దక్షణ ఎంపీ, బీజేపీ నాయకుడు తేజస్వీ సూర్య కొన్ని రోజుల క్రితం బయట పెట్టిన విషయం తెలిసిందే. దీంతో కర్నాటక ప్రభుత్వం దీనిపై విచారణకు సైతం ఆదేశించింది. కాగా, బీబీఎంపీ కోవిడ్ వార్ రూం లోని 17 మంది ముస్లిం ఉద్యోగులు బెడ్ స్కాంలో హస్తం కలిగి ఉన్నారన్న తేజస్వీ ఆరోపణలపై సస్పెండ్ అయ్యారు. అయితే, ఈ బెడ్ స్కాంలో ఆ 17 మంది ఉద్యోగులు ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు క్రైం బ్రాంచ్ పోలీసులు విచారణ జరిపారు. అయితే ఈ ఆరోపణలపై పోలీసులు ఎలాంటి ఆధారాలను పొందుపర్చలేకపోయారు. దీంతో ఆ ఉద్యోగులకు ఊరట లభించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారు తిరిగి విధుల్లోకి చేరనున్నారు. అయితే, బీజేపీ ఎంపీ తేజస్వీతో పాటు ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ అంశానికి మతం రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారనీ, ఇది చాలా దారుణమైన విషయమని ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శించారు. ఈనెల 4న లైవ్ ప్రొగ్రామ్‌లో తేజస్వీ సూర్యతో పాటు, బీజేపీ ఇద్దరు ఎమ్మెల్యేలు.. ఆ 17 మంది ముస్లిం ఉద్యోగులను ఎవరు నియమించారంటూ అధికారులను ప్రశ్నించిన విషయం విదితమే.