Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లీటర్ పెట్రోల్‌పై 26 పైసలు, డీజీల్‌పై 33 పైసలు
- ముంబయిలో సెంచరీకి చేరువలో పెట్రోల్ ధర
న్యూఢిల్లీ : రెండు రోజుల విరామం తర్వాత ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్, డీజీల్ ధరలు మళ్లీ పుంజుకున్నాయి. దీంతో దేశంలోని సామన్యులకు మళ్లీ పెట్రో వాత పడింది. సోమవారం లీటర్ పెట్రోలఫై 26 పైసలు, డీజీల్‌పై 33 పైసలు పెరిగాయి. తాజాగా సవరించిన ధరల ప్రకారం.. దేశరాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.53కు చేరుకున్నది. డీజీల్ ధర రూ. 82.06కు ఎగబాకింది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర సెంచరీకి చేరువైంది. ఇక్క పెట్రోల్ రూ. 97.86కు ఎగబాకింది. ఇక్కడ డీజీల్ ధర రూ. 89.17కు చేరుకున్నది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల ధర రూ. 91.66, డీజీల్ ధర రూ. 84.90గా నమోదైంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.38 కాగా, డీజీల్ ధర రూ. 86.96కు చేరుకున్నది. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.13కి చేరుకున్నది. డీజీల్ ధర రూ. 89.47గా ఉన్నది. అయితే, ముంబయి తర్వాత పెట్రోల్ ధరలు ముంబయి తర్వాత హైదరాబాద్‌లోనే అధికంగా ఉన్నది. ఇక డీజీల్ ధర మిగత మెట్రో నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్‌లోనే అధికంగా ఉండటం గమనార్హం.