Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ మార్గదర్శకాలు
న్యూఢిల్లీ : కరోనా కట్టడిపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా రోగులకు ఉచితంగా వైద్యం అందించాలని సూచించింది. అందరికీ టీకాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవడంతో పాటూ, శ్మశాన వాటికల మౌలిక వసతులను మెరుగుపరచాలని పేర్కొంది. అలాగే, కరోనా యోధుల రక్షణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రియల్ టైం డాష్ బోర్డు ఏర్పాటుచేయాలని సూచించింది. డాష్ బోర్డులో ఆస్పత్రులు, ఆక్సిజన్, ఐసీయు బెడ్లు, మందులు, యంత్రాల వివరాలు ఉంచాలని స్పష్టం చేసింది. ఇదే సందర్భంలో ఆక్సిజన్ సిలిండర్లు, మందులు బ్లాక్ మార్కెట్ చేస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని పేర్కొంది. ప్రభుత్వ ప్రయివేటు ఆసుపత్రిలో హెల్ప్ డెస్క్ లో ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ సూచనల పై తీసుకున్న చర్యలను నాలుగు వారాల్లో నివేదించాలని కేంద్రానికి రాష్ట్రానికి ఆదేశాలు జారీ చేసింది.