Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాజాగా మరోసారి పెంపు
- మహారాష్ట్రలో రూ.100 దాటిన పెట్రోల్
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ సర్కార్ నిర్వాకంతో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర సెంచరీ కొడుతోంది. రెండు రోజుల తర్వాత ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సోమవారం మెట్రో నగరాల్లో పెంచిన ధరల ప్రకారం.. ఢిల్లీలో పెట్రోల్ ధర 26 పైసల పెంపుతో రూ.91.53కు చేరింది. డీజిల్ ధర 33 పైసలు పెరగడంతో రూ.82.06గా ఉంది. మెట్రో నగరాలపరంగా ప్రస్తుతం ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో దేశంలోనే అధిక ధరలు ఉన్నాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గణాంకాలు చెబుతున్నాయి. ఇక్కడ పెట్రోల్ రిటైల్ ధర రూ.97.86, డీజిల్ ధర 89.17గా ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్లతోపాటు మహారాష్ట్రలో కూడా పెట్రోల్ ధర వంద రూపాయలకు చేరింది. కొన్ని రోజుల క్రితమే రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.100 దాటగా, తాజాగా మహారాష్ట్రలోని పర్బానిలో పెట్రోల్ రూ.100.20కు చేరింది.