Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా సెకండ్‌వేవ్ కల్లోలం రేపుతోంది. మహమ్మారి సునామీల విరుచుకు పడుతుండటంతో నిత్యం రికార్డు స్థాయిలో కొత్త కేసులు,మరణాలు నమోదవున్నాయి.ఆస్పత్రుల్లో పడకలు,మందులు,టీకాలు,ఆక్సిజన్ కొరతతో దేశ ఆరోగ్యరంగం సంక్షోభంలోకి జారుకుంది.మరీ ముఖ్య ంగా ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటం దేశంలో నెలకొన్న ప్రస్తుతం వినాశకర పరిస్థితులకు అద్దం పడుతోంది. దేశంలో ఆక్సిజన్ కొరత కారణంగా గడిచిన వారాల్లో 197 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారిక గణా ంకాలు చెబుతున్నాయి. మరో 70 మరణాలు ఆక్సిజన్ కొరత కారణంగానే సంభవించాయని మృతుల కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. అయితే, ప్రభుత్వ లెక్కల్లోకిరాని ఆక్సిజన్ కొరత మరణాలు పైన తెలిపిన సంఖ్య కంటే అధికంగానే ఉన్నాయని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.నేడు దేశంలో ఆక్సిజన్ సరిపడినంత ఉందనీ, దానికి అనుగుణంగా సరఫరా చేస్తున్నామనీ, దీని కోసం విదేశాల నుంచి సైతం భారీగా ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకుంటున్నామని కేంద్రం చెబుతోంది. అయితే, దీనికి భిన్నంగా ఆక్సిజన్ కావాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కేంద్రానికి మొరపెట్టుకుంటున్నాయి.