Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాజీపూర్ ఘాట్ వద్ద 52 మృతదేహాలు గుర్తింపు..బక్సర్ వద్ద 71 శవాలు
పాట్నా : బీహార్లోని బక్సర్ పట్టణానికి సమీపంలో గంగానదిలో సోమవారం 110 మృతదేహాలను స్థానికులు గుర్తించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇవి కోవిడ్ మృతదేహాలనీ, ఉత్తరప్రదేశ్లో మరో 52 శవాలు గుర్తించారు. యూపీ నుంచే ఈ పార్థీవదేహాలు కొట్టుకుని వచ్చాయని బీహార్ అధికారులు చెబుతున్నారు. కాగా, మంగళవారం 71 మృతదేహాలను బక్సర్ జిల్లా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహలన్ని కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో నది ఒడ్డునే పోస్టుమార్టరం, తదుపరి పరీక్షల కోసం నమూనాలు సేకరించడం నిర్వహించారు. అయితే మిగిలిన వివరాలు చెప్పడానికి అధికారులు నిరాకరించారు. కనీసం ఎన్ని మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించిన విషయాన్ని కూడా అధికారులు స్పష్టం చేయలేదు. అధికారులు 71 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నా, అప్పటికే చాలా మృతదేహాలు ప్రవాహంలో కొట్టుకుని వెళ్లిపోయాయని స్థానికులు చెబుతున్నారు.