Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆక్సిజన్ అందక 26మంది కరోనా రోగులు మృతి
పనాజీ: దేశంలో ఆక్సిజన్ అందక కరోనా రోగులు మృతిచెందిన ఘటనలు రోజూ ఏదో ప్రాంతం నుంచి వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా గోవాలో విషాద ఘటన చోటుచేసుకున్నది. రాష్ట్రంలోని ప్రధాన ఆసుపత్రి అయిన గోవా మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రిలో కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే 26 మంది కరోనారోగులు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం తెల్లవారుజామున ఉద యం 2 గంటల నుంచి 6 గంటల మధ్య ఈ మరణాలు సంభవించినట్టు రాష్ట్ర ఆరోగ్య మంత్రి విశ్వజీత్ రాణే తెలిపారు. ఘటన నేపథ్యంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆస్పత్రికి వెళ్ళి వివరాలు సేకరించారు. 'మెడికల్ ఆక్సిజన్ లభ్యత, కొవిడ్ వార్డుల్లోకి సరఫరా మధ్య జరిగిన ఆలస్యం కారణంగా రోగులకు సమస్యలు ఎదురై ఉండొచ్చు' అని సీఎం అన్నారు. అయితే రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే కొన్ని సార్లు సిలిండర్లు సమయానికి చేరుకోకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. ఆస్పత్రుల్లో ఆక్సి జన్ సరఫరాకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.