Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుక్మా జిల్లా పెంట గ్రామంలో ఘటన
నవతెలంగాణ-చర్ల
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా డోర్నపాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెంటా గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి ఓ జవాన్‌ను మావోయిస్టులు పాశవికంగా నరికి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న జవాన్ వెట్టి భీముడు గ్రామంలో ఓ ఇంట్లో నిద్రిస్తున్నాడు. అర్ధరాత్రి సమయంలో సాదా దుస్తుల్లో మావో యిస్టులు ఆ ఇంటికి రావడంతో.. గమనించిన జవాన్ కిటికి నుంచి బయటకు పారిపోయేందుకు ప్రయత్నించాడు. అప్పటికే ఆ ఇంటిని మావోయిస్టులు చుట్టుముట్టడంతో జవాన్ భీముడ్ని మావోయిస్టులు పట్టుకుని వారి వెంట కొంత దూరం తీసుకెళ్ళారు. అక్కడ చెట్టు కింద అత్యంత దారుణంగా కర్రలతో దాడి చేసి, పదునైన ఆయుధంతో మెడ కోసి చంపారు. మృతదేహాన్ని గ్రామం సమీపంలో పడేశారు.