Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భీమా-కోరేగావ్ కుట్ర కేసులో నిందితులుగా ఉన్న సామజిక కార్యకర్త గౌతమ్ నవ్లఖా బెయిల్ పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. నిషేధిత మావోయిస్టు అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో 2017 మార్చిలో కబీర్కాలా మార్చ్ పేరిట పూణేలోని షానివర్వాడ ప్రాంతంలో సభలు నిర్వహించారు. ఆ సందర్భంగా పలువురు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడంతో హింసాత్మక ఘటనలు చెలరేగాయని పేర్కొంటూ నమోదైన కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. వారిలో గౌతమ్ నవ్లఖా కూడా ఉన్నారు. ఈ కేసులో ఇదివరకు బెయిల్‌ను బాంబే హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో దానిని అప్పీలు చేస్తూ నవ్లఖా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే బుధవారం విచారణ జరిపిన జస్టిస్ లలిత్, జస్టిస్ కేఎమ్.జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది.