Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ ప్రభుత్వానికి హైకోర్టు ప్రశంసలు
తిరువనంతపురం : ప్రయివేటు ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సకు టారిఫ్ నిర్ణయిస్తూ కేరళ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర హైకోర్టు అభినందించింది. 'అద్భుతమైన ఆదేశాలు'గా అభివర్ణించింది. ఇలాంటి ఆదేశాలు ప్రజలకు ప్రయోజనకరంగా ఉండటంతోపాటు, కోర్టులపై ఒత్తిడిని తగ్గిస్తాయని జస్టిస్ దేవన్ రామచంద్రన్ జస్టిస్ కౌసెర్ ఇడప్పగత్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. కోవిడ్ కేంద్రా లు, పరీక్షా కేంద్రాలు అధిక ధరలను వసూలు చేస్తున్నాయని న్యాయమూర్తులు సి ఎన్ శ్రీకుమార్, మంజు పౌల్, సురేష్కుమార్. సి ద్వారా న్యాయవాది సబు థామస్ వేసిన పిటిషన్ విచారణలో ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అలాగే, ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులు, ఈఎస్ఐసీ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో 50 శాతం పడకలను కోవిడ్ చికిత్సకే కేటాయించామని రాష్ట్ర అటర్నీ కోర్టుకు తెలిపారు. జాతీయ గుర్తింపు ఉన్న ఆసుపత్రులు, జాతీయ గుర్తింపు లేని అన్ని ప్రయివేటు ఆస్పత్రుల్లోనూ జనరల్ వార్డుల్లో రోజు వారి ధరలను రూ 2,645 నుంచి 2,910 వరకూ నిర్ణయించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సమర్పిస్తున్న కారుణ్య పథకం (కేఏఎస్పీ) పరిధిలోనికి రాని వారికి ఈ ధరలను వసూలు చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించినట్టు పేర్కొన్నారు. ఆక్సిజన్, ఔషధాలు, నర్సింగ్, బోర్డింగ్ అన్ని చార్జీలను కలుపుకునే ఈ ధరలను రూపొందించినట్టు తెలిపారు. ఐసీయూకు రూ 8580, వెంటిలేటర్ ఉన్న ఐసీయూకు రూ 15180 గరిష్ట ధరను నిర్ణయించినట్టు చెప్పారు.