Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు ప్రాంతాల్లో సెంచరీని దాటి పరుగులు
- పెట్రోల్, డీజీల్ లపై 25 పైసల చొప్పున పెరుగుదల
- వరుసగా మూడో రోజు.. నెలలో ఏడు సార్లు పైకి ఎగబాకిన ధరలు
న్యూఢిల్లీ : దేశంలో ఇంధన ధరలు దడపుట్టిస్తున్నాయి. వరుసగా మూడో రోజూ చమరు ధరలు పెరిగాయి. అంతేగాక, దేశంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ మార్కును దాటి ఆల్ టైం హైకి చేరుకున్నాయి. అయితే, ఇంధన ధరల పెరుగుదల ఈనెలలో ఇది ఏడోసారి కావడం గమనార్హం. ఈ నెలలో పెట్రోల్‌పై ఇప్పటి వరకు రూ. 1.65, డీజీల్‌పై రూ. 1.88 మేర ధరలు పెరగడం సామాన్యుణ్ణి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నది. కాగా, బుధవారం పెట్రోల్, డీజీల్ ల పై 25 పైసల చొప్పున ధరలు పెరిగాయి. దేశరాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 92.05గా, డీజీల్ ధర రూ. 82.61గా రికార్డయ్యాయి. వాణిజ్యరాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.36ను చేరుకోగా, డీజీల్ రూ. 89.75గా నమోదైంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.84, డీజీల్ ధర రూ. 93.84 గా ఉన్నది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 92.16 , డీజీల్ ధర రూ. 92.16కి ఎగబాకింది. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.67 గా ఉన్నది. డీజీల్ ధర రూ. 90.06 కు చేరుకున్నది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పెట్రోల్ ధరలు హీటెక్కిస్తున్నాయి. అక్కడ ధరలు సెంచరీ మార్కును దాటాయి. లీటర్ పెట్రోల్ రూ. 100.08గా ఉన్నది. ఇక డీజీల్ ధర రూ. 90.95గా నమోదైంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ లలోని పలు ప్రాంతాల్లోనూ పెట్రోల్ ధరలు సెంచరీని దాటి సామాన్యుడిని వణికిస్తున్నది.