Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆగ్రా : అతను జీవితం మొత్తాన్ని మోడీ కోసమే అన్నట్టు బతికాడు. తన కారు వెనకాల మోడీ భారీ చిత్రం ఏర్పాటు చేసుకున్నాడు. మోడీని ఎవరైన విమర్శిస్తే కొట్టడానికి వెళ్లేవాడు. దీంతో అందరూ అతన్ని 'మోడీ భక్తుడు'గా పిలిచేవారు. అలాగే అతని ట్విట్టర్‌ఖాతాను ప్రధాని మోడీ ఫాలో అయ్యే వారు. దీంతో ట్వీటర్లో తనను ప్రధాని అనుసరిస్తాడని గొప్పగా చెప్పుకోనేవాడు. అయితే అతను కరోనాతో చావుతో పోరాటం చేస్తుంటే ప్రధాని మోడీ పట్టించుకోలేదు. కనీసం బెడ్ అయినా కేటాయించే విధంగా చూడాలని బంధువులు చేసిన వినతిని పక్కనపెట్టారు. దీంతో అతను సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోయాడు. తల్లిని బతికించుకోలేకపోయాడు. ట్విటర్లో ప్రధాని మోడీ అనుసరించే వ్యక్తికే ఈ పరిస్థితి ఎదురైతే.. మోడీని అనుసరించే వారి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
ఈవార్త పూర్తి వివరాల్లోకి వెళితే ఆగ్రాలోనివసించే 42ఏండ్ల ఆర్ఎస్ ఎస్ కార్యకర్త అమిత్ జైస్వాల్‌కు మోడీ అంటే విపరీతమైన అభిమానం. ఇతన్ని ట్విట్టర్లో ప్రధాని మోడీ అనుసరిస్తుంటారు. అయితే ఇటీవల అమిత్ కరోనా సోకి తీవ్ర స్థితిలో ఉండగా, అతని బంధువులు సహాయం కోసం మోడీకి విజ్ఞప్తి చేశారు. కనీసం ఆసుపత్రిలో బెడ్ అయినా కేటాయిం చేలా జోక్యం చేసుకోవాలని వేడుకున్నారు. జైస్వాల్ ఎకౌంట్ నుంచే ఈ విజ్ఞప్తి చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అధిత్యనాథ్ను కూడా ట్యాగ్ చేశారు. చికిత్సలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని కూడా తెలిపారు. అయినా మోడీ పట్టించుకోలేదు. ఆగ్రాలో బెడ్ దొరకపోవడంతో అమిత్‌ను కుటుంబ సభ్యులు చివరికి అతన్ని మధురకు తీసుకుని వచ్చారు. అక్కడ నియతి ఆసుపత్రిలో 10 రోజుల చికిత్స తరువాత చనిపోయారు.
అమిత్‌ను 'మోడీ భక్తుడు'గా అతని కుటుంబ సభ్యులు అభివర్ణిస్తుంటారు. 'మోడీ, యోగీలకు వ్యతిరేకంగా ఒక్క మాటను కూడా అమిత్ వినలేకపోయేవారు. ఈ ఇద్దరిని ఎవరైన విమర్శిస్తే వారిని కొట్టడానికి వెళ్లేవారు' అని తెలిపారు. తన కారు వెనకాల మోడీ భారీ చిత్రాన్ని ఉంచుకునేవారని చెప్పారు.
'అమిత్ తన జీవితం మొత్తాన్ని మోడీ కోసం పోరాటం చేయడానికే వినియోగించారు. అయితే మోడీ అతనికి ఏం చేశారు' అని అమిత్ సోదరి భర్త రాజేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. కారు వెనకాల ఉన్న మోడీ చిత్రాన్ని ఆగ్రహంతో చించేశారు. అమిత్ తల్లి రాజ్‌కమల్ జైస్వాల్ కూడా కరోనాతోనే ఇటీవలే మరణించారని తెలిపారు. అమిత్‌కు 10 రోజుల చికిత్సకు రూ 5 లక్షలు బిల్ వేశారనీ, అతని తల్లి 20 రోజుల చికిత్సకు రూ 11 లక్షల బిల్ వేశారని తెలిపారు.
ప్రకటనల బోర్డులు, బ్యానర్లు తయారు చేస్తూ అమిత్ జీవితం సాగిం చేవాడనీ, అయినా ఆర్ఎస్ఎస్ అంటే అభిమానంతో ఎన్నో కార్యక్రమాలు చేపడ్డాడని గుర్తు చేసుకున్నారు. గత ఏడాది డిసెంబర్లో తన సొంత ఖర్చులతో అయోధ్యకు వెళ్ళి, నగరం మొత్తం 'రామజన్మభూమి' అనే ఎల్ఈడీ బోర్డులు ఏర్పాటు చేశాడని బంధువులు తెలిపారు. ఇలాంటి వ్యక్తినే మోడీ పట్టించుకోకపోతే, సామాన్యల పరిస్థితి ఏమిటి అని స్థానికులు విమర్శిస్తున్నారు.