Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్నేషనల్ రిలిజియన్ రిపోర్టులో వెల్లడి
- విడుదల చేసిన యూఎస్
న్యూఢిల్లీ : అంతర్జాతీయ మత స్వేచ్ఛ నివేదిక 2020 ని అమెరికా విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 200 ల దేశాలు, ప్రాంతాలకు చెందిన మత స్వేచ్ఛ సంబంధించిన పరిస్థితిపై ఇందులో పొందుపరిచారు. భారత్ సహా 56 దేశాల్లో మతస్వేచ్ఛ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయనీ, మత స్వేచ్ఛపై తీవ్రమైన ఆంక్షలు ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. మానవ హక్కులు గౌరవానికి నోచుకుంటే తప్పా మతస్వేచ్ఛ గురించి పూర్తిగా అర్థం చేసుకోలేమని విలేకరుల సమావేశంలో యూఎస్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. మతస్వేచ్ఛ కీలకమైన అంశమని చెప్పారు. అది లేకపోతే ప్రజలు తమ దేశ విజయంలో పూర్తిగా భాగస్వామ్యం కాలేరని ఆయన వివరించారు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రజలు మతస్వేచ్ఛకు నోచుకోలేకపోతు న్నారని చెప్పారు. ఇరాన్ వంటి దేశాల్లో మైనారిటీ గ్రూపులపై అరెస్టులు, వేధింపులు, బెదిరింపులు కొనసాగుతున్నాయని ఆంటోనీ తెలిపారు. సౌదీ అరెబియాలో ఒక్క చర్చి కూడా లేనప్పటికీ అక్కడ క్రైస్తవులు లక్షల సంఖ్యలో ఉన్నారన్నారు. మతస్వేచ్ఛ విషయంలో సూడాన్, ఉజ్బెకిస్తాన్, టుర్క్మెనిస్తాన్లు సానుకూల అడుగులు వేశాయని చెప్పారు. మత స్వేచ్ఛను ఉల్లంఘించే విషయంలో ప్రభుత్వ విధానాలు, మతాల ఆచారాలు, మత స్వేచ్ఛను ప్రమోట్ చేసే విషయంలో యూఎస్ విధానాలను కవర్ చేస్తూ ఈ నివేదికను రూపొందించారు. అంతర్జాతీయ మత స్వేచ్ఛ చట్టం 1998కి అనుగుణంగా యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఈ నివేదికను సమర్పించింది.