Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీలో అదృశ్యం కేసు నమోదు
- సంక్షోభంలో ఆయన ఎక్కడున్నారంటూ నెటిజన్ల ఆగ్రహం
- బెంగాల్ ఎన్నికల తర్వాత కనిపించని హోం మంత్రి
న్యూఢిల్లీ : కరోనా వైరస్ విజంభణతో దేశం యావత్తు అతలాకుతలమవుతున్న నేపథ్యంలో.. కేంద్ర హోం మంత్రి ఎక్కడీ అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు ట్విట్టర్లో ఎన్ఎస్యూఐ 'అమిత్‌షా మిస్సింగ్' అనే హ్యష్‌ట్యాగ్‌తో ట్విట్టర్ హౌరెత్తింది. దేశం కోవిడ్‌పై పోరాటం చేస్తుంటే 'హౌం మంత్రి మిస్సింగ్ ఇన్ యాక్టన్' అంటూ నెట్టింట్టో వైరల్ అయ్యింది. మరోవైపు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) ఏకంగా ఆయన కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులకు ఎన్ఎస్యూఐ సెక్రెటరీ నగేశ్ కరియప్ప ఈ మేరకు ఫిర్యాదును అందచేశారు. కరోనా కోరల్లో దేశం చిక్కుకుని, ప్రజలు సంక్షోభం ఎదుర్కొంటున్న ఇలాంటి తరుణంలో అమిత్‌షా కనిపించకుండా పోయారని కరియప్ప తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజకీయ నాయకులు దేశానికి సేవ చేయాలే కానీ, సంక్షోభ పరిస్థితుల్లో పలాయనం చిత్తగించకూడదని తెలిపారు. చివరిసారిగా అమిత్‌షా బెంగాల్ ఎన్నికల ప్రచారంలో కనిపించారని.. ఆ తర్వాత నుంచి జాడ తెలియటంలేదని పేర్కొన్నారు. బెంగాల్ ఎన్నికల ప్రచారం ముగిసి, ఫలితాలు వెల్లడయిన తర్వాత అమిత్ షా ఇంత వరకూ మీడియా ముందుకు రాలేదు.