Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్‌లో కోవిడ్ రెండో దశ ముప్పుపై డబ్ల్యూహెచ్ఓ
న్యూఢిల్లీ : భారత్‌లో కోవిడ్ రెండోదశలో పుంజుకోవడానికి, వేగంగా వ్యాప్తి చెందడానికి మత పరమైన, రాజకీయ సామూహిక సమీకరణ కార్యక్రమాలే ప్రధాన కారణాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) పేర్కొంది. కరోనా కట్టడిలో వైఫల్యంపై ఇప్పటికే పలు దేశాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న మోడీ సర్కార్ ఇప్పుడు ప్రపంచదేశాల ముంగిట ఇరుకున పడ్డట్లయింది. కాగా, బి.1.617 వేరియంట్ భారత్‌లో గతేడాది అక్టోబర్‌లోనే వెలుగు చూసినట్టు తెలిపింది. భారత్‌లో కరోనా తిరిగి విజంభించడం, వేగంగా అభివద్ధి చెందడంతో బి.1.617, బి.1.1.7తో సహ ఇతర వేరియంట్ల పాత్రపై పలు అనుమా నాలు తలెత్తేలా చేసిందని పేర్కొంది. ఇటీవల భారత్‌లో ఎదురౌతున్న భయాన పరిస్థితులను అంచనా వేయగా.. కరోనా పునరుద్ధానం, వేగంగా వ్యాప్తిచెందటం వెనుక అనేక కారణాలు ఉన్నాయని గ్రహించామని తెలిపింది. ఇందులో భాగంగా కోవిడ్ సెకండ్ వేవ్ కేసుల నిష్పత్తి పెరుగుదల, వ్యాప్తికి కూడా మత పరమైన, రాజకీయ పరమైన కార్యక్రమాలే కారణమని తేల్చి చెప్పింది. ప్రజారోగ్యం, సామాజిక చర్యలపై శ్రద్ధ చూపకపోవడం కూడా కేసుల విజృంభణకు దారి తీశాయని డబ్య్లుహెచ్ఓ తెలిపింది. భారత్‌లో సార్క్-కోవిడ్ -2ను వేరియంట్‌ను గుర్తించేందుకు సుమారు 0.1 శాతం పాజిటివ్ శాంపిల్స్‌ను క్రమం చేసి, వైరస్‌ను వేగంగా గుర్తించే జీఐఎస్ఏఐడీ అప్లోడ్ చేసినట్టు తెలిపింది. ఏప్రిల్ 2021 చివరి నాటికి దేశంలో బి. 1.617.1, బి. 1.617. 2 వంటి వేరియంట్లు.. వరుసగా 21శాతం, 7శాతం వ్యాప్తి చెందినట్టు గుర్తించామని తెలిపింది. దీనికి సంబంధించిన నివేదికను జీఐఎస్ఏఐడీకి డబ్ల్యుహెచ్ఓ సమర్పించింది.