Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమం శుక్రవారం నాటికి 169వ రోజుకు చేరింది. ఉద్యమం కొనసాగిస్తూనే, కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు హర్యానా ప్రభుత్వం వైద్య సేవలు అందించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అయినప్పటికీ వందలాదిమంది డాక్టర్లు బృందాలుగా ఏర్పడి రైతులకు వైద్య సేవలందిస్తున్నారు. అనారోగ్యానికి గురైన రైతులకు పరీక్షలు నిర్వహించడం, మందులు అందించడం చేస్తున్నారు