Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీ మొదటి ప్రాధాన్యతగా వ్యాక్సిన్ అందించాలి
- శ్రీ కేంద్రానికి సిఐటియు డిమాండ్
న్యూఢిల్లీ : వ్యాక్సిన్ తయారీ ఉద్యోగులు, కార్మికులను ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా ప్రకటించాలని, మొదటి ప్రాధాన్యతాక్రమంలో వారికి వ్యాక్సినేషన్ చేయించాలని సిఐటియు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. వీరిని ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా ప్రకటించడం ద్వారా, హెల్త్, జీవిత బీమా సౌకర్యంతోపాటు, ఇతర ప్రమాద భత్యాలను కల్పించాలని సూచించింది. దేశంలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ రంగంలోని ఔషధ తయారీ సంస్థల సాయంతో వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలని, తద్వారా దేశ ప్రజలందరికీ సత్వరంగా ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని పేర్కొంది. ఈ మేరకు సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాల కారణంగా దేశంలో వ్యాక్సిన్ల కొరత ఏర్పడిందని సిఐటియు విమర్శించింది. వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచి, యుద్ధప్రాతిపదికన అందరికీ టీకా అందించాల్సిన ముఖ్యమైన సమయంలో.. కొత్త వ్యాక్సిన్ విధానం ద్వారా ప్రభుత్వం నిస్సిగ్గుగా అంతర్జాతీయ డ్రగ్ మాఫియాకు లొంగిపోయిందని విమర్శించింది. ఫలితంగా దేశంలో వ్యాక్సినేషన్ రేటు భారీగా తగ్గిపోయిందని విమర్శించింది. కోవాగ్జిన్ తయారీ చేస్తున్న భారత్ బయోటెక్ కంపెనీలో 50 మంది ఉద్యోగులు, కార్మికులు కోవిడ్ బారిన పడ్డారని ఆ సంస్థ జాయింట్ ఎమ్‌డి ప్రకటిం చారని, ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశమని పేర్కొంది. ఇది వ్యాక్సిన్ ఉత్పత్తి వేగం మందగించడానికి ఒక కారణం కూడా అని సిఐటియు అభిప్రాయపడింది. కార్మిక సంఘాలు, ఇతర వర్గాల నుంచి వచ్చిన డిమాండ్, ఒత్తిడి కారణంగా మూడు ప్రభుత్వ రంగం సంస్థలైన ముంబయికి చెందిన హాఫ్కిన్ బయోఫార్మాస్యూటికల్, హైదరాబాద్‌లోని ఇండియాన్ ఇమ్యునోలాజికల్స్, బులంద్షహార్లోని భారత్ ఇమ్యునోలాజికల్స్ అండ్ బయొలాజికల్స్లకు వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచేందుకుగానూ కోవాగ్జిన్ తయారీకి అనుమతులు ఇచ్చారని పేర్కొంది.