Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కొన్ని రోజుల నుంచి కరోనాతో బాధపడుతున్న జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) మాజీ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖాలీద్ కోలుకున్నారు. తిహార్ జైలులో శిక్షను అనుభవిస్తున్న ఆయన తిరిగి తన సెల్‌కు వెళ్లాడని అధికారులు తెలిపారు. ఉమర్ ఖాలీద్లో కోవిడ్-19 వ్యాధి లక్షణాలు కనబడిన వెంటనే ఆయనను తిహార్ జైలు పరిసర ప్రాంతాల్లో ఐసోలేట్ చేసినట్టు చెప్పారు. గత నెల 24న జరిపిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో ఉమర్ ఖాలీద్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈశాన్య ఢిల్లీలోని ఖజురీ ఖాస్ ప్రాంతంలోహింసాత్మక అల్లర్లకు సంబంధించి ఉమర్ ఖాలీద్‌ను గత అక్టోబర్‌లో పోలీసులు అరెస్టు చేశారు.